ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పాత నేరస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ

విశాఖపట్నం: కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,సీనియర్ జర్నలిస్ట్ కారుకొండ వీరేంద్రయాదవ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పరవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ బండి రమణయ్య చేతుల మీదగా పాత నేరస్తులకు ఒక్కక్కరికి 5 కేజీల బియ్యం,2 సబ్బులు,1ఆయిల్ పాకెట్,1కే జి టొమోట,1కే జి ఉల్లిపాయలు పంపిణి చేసారు..

ఈ సందర్భంగా విశాఖ జిల్లా పరవాడ క్రైమ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బండి.రమణయ్య మాట్లాడుతూ ఎంతో మంది సమాజంలో ధనవంతులున్నారని, సేవచేయాలనే ఆలోచన కొద్దిమందికి మాత్రమే ఉంటుందని, దేవుడు ఆ అవకాశం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ద్వారా కల్పించాడని అందులో భాగంగా ఈ రోజు పాత నేరస్తులకు ఒక్కక్కరికి 5 కేజీల బియ్యం,2 సబ్బులు,1ఆయిల్ పాకెట్,1కేజి టొమోట,1కేజి ఉల్లిపాయలు పంపిణి చేసారన్నారు..పాతనేరస్థులు క్రమశిక్షణ భావంతో మెలుగుతూ సమాజంలో కష్టపడి పనిచేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.ఇటీవల కరొనా మహమ్మారి వలన కూలిపనులు లేక అలమటిస్తున్న వారిని గుర్తించి, వారికీ కరోనా వ్యాధిపట్ల,నేరాల మీద అవగాహనా కల్పిస్తున్నామన్నారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు,హుదూద్,తితిలీ,తు పాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసామని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు,జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు..కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు,పేద ప్రజలకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు  శానిటైజర్లు,మాస్కులను,నిత్యావసర వస్తువులను,ఆహార పొట్లాలను దాతల సహకారం తో పంపిణీ చేస్తున్నామని వీరేంద్ర యాదవ్ తెలిపారు.కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా పరవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న పాత నేరస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు,సభ్యులు,పాత నేరస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *