బాపట్లలో పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు మాస్కులు, బియ్యం, కూరగాయలు పంపిణీ

బాపట్ల: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పోలీస్ స్టేషన్ రోడ్డులో ‘మీ అండ్ మై వరల్డ్ టీం’ సహకారంతో 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు మాస్కులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ దేవి ఆధ్వర్యంలో మీ అండ్ మై వరల్డ్ టీం సహకారంతో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడ్వకేట్ తిరువీధుల సెంటర్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ దేవి మాట్లాడుతూ కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్‌లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు బాపట్లలో 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు మాస్కులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు, హుదూద్, తితిలీ, తుపాన్ బాధితులకు ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువుల అందచేసామని, ఇవే కాకుండా మెడికల్ క్యాంపులు, పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు, జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు, పేద ప్రజలకు, ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్కులను, నిత్యావసర వస్తువులను, ఆహార పొట్లాలను దాతల సహకారంతో పంపిణీ చేస్తున్నామని దేవి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, మీ అండ్ మై టీం లక్ష్మీ సభ్యులు, హలీమా, మల్లేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *