అవిశ్రాంత సేవలందిస్తున్న  పోలీసులకు, జర్నలిస్టులకు మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్టు సంఘ నేతలు

@ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎవరూ చేయని రీతిలో ప్రాణాలు తెగించి పని చేస్తున్న జర్నలిస్టులను పోలీస్ శాఖ తరపున అభినందించిన సీఐ శ్రీధర్ కుమార్ @

ఇబ్రహీంపట్నం/ మైలవరం/కృష్ణా జిల్లా: లాక్ డౌన్ లో అవిశ్రాంత సేవలందిస్తున్న పోలీసులకు,జర్నలిస్టులకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్  అసోసియేషన్ (ఎన్. ఎ.ఆర్. ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మల్లాది ప్రసాద్ రావు,కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు,మాస్క్ లు 150 మందికి పంపిణి చేశారు.పోలీసులతో పాటు ఇబ్రహీంపట్నం లో పని చేస్తున్న జర్నలిస్టు లకు కుడా అందజేశారు.ఇబ్రహీంపట్నం సీ.ఐ శ్రీధర్ కుమార్ చేతుల మీదుగా భౌతిక దూరం పాటిస్తూ ఈ మాస్క్ లను,మజ్జిగ ప్యాకెట్ లను పంపిణి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జర్నలిస్టులు ఎవరూ చేయని రీతిలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని, అటువంటి జర్నలిస్టులను పోలీస్ శాఖ తరుపున అభినందిస్తున్నట్లు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో మేము అవిశ్రాంతంగా పోరాడుతున్నట్లుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) భావించి మాకు, మా పోలీస్ సిబ్బందికి మాస్కులు,బట్టర్ మిల్క్ ప్యాకెట్స్ అందించడం చాలా అభినందనీయమని సీఐ శ్రీధర్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మానస మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితుల కు,హుదూద్,తితిలీ,తుపాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసామని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు,జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు..కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు,పేద ప్రజలకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శానిటైజర్లు,మాస్కులను,నిత్యావసర వస్తువులను,ఆహార పొట్లాలను దాతల సహకారం తో పంపిణీ చేస్తున్నామని ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మానస తెలిపారు.

నేషనల్ జాయింట్ సెక్రటరీ మద్దినేని నవీన్ మాట్లాడుతూ మనం – మన సమాజం – మన రాష్ట్రం – మన దేశం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ చేసే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మీకు చేతనైనంత ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులను అందించి,కరోనా పై పోరాటానికి సహకారం అందించాలని దాతలను కోరారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో సీఐ శ్రీధర్ కుమార్ చేతులమీదుగా పోలీసులకు,జర్నలిస్టులకు మజ్జిగ ప్యాకెట్లు,శానిటైజర్లు,మాస్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమం లో యం.ప్రసాదరావు,కె.నాగరాజు,ప్రదీప్,ప్రసాద్,శివ,వినయ్, రాజు, సత్య,మురళి,రవికిరణ్ కృష్ణా జిల్లా యూనియన్ నాయకులు, ఇబ్రహీంపట్నం జర్నలిస్టులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *