గంపలగూడెం లో అత్యవసర విధులు నిర్వహిస్తున్న అధికారులు,సిబ్బంది కి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ యూనియన్

గంపలగూడెం/కృష్ణాజిల్లా: గంపలగూడెం సెంటర్ మరియు తోటముల లో అత్యవసర విధులు నిర్వహిస్తున్న పోలీసు,హెల్త్ అసిస్టెంట్స్,జర్నలిస్టులు,పారిశుద్ధ్య కార్మికులు మరియు సచివాలయ సిబ్బంది కి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంభంపాటి నాగరాజు ఆధ్వర్యంలో 100 మందికి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంపలగూడెం ఇంచార్జి తహశీల్దార్ రవీంద్ర నాథ్ విచ్చేసారు..
రవీంద్రనాథ్ చేతుల మీదగా 100 మందికి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా ఇంచార్జి తహసిల్దార్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ నేషనల్ యాక్టివ్ రిపోటర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ,కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవలో మేము సైతం ముందు ఉంటామంటూ ఈరోజు గంపలగూడెం లో అత్యవసర విధులు నిర్వహిస్తున్న పోలీసు, హెల్త్ అసిస్టెంట్స్,జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు సచివాలయ సిబ్బంది కి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేయడం చాలా అభినందనీయమన్నారు..

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంభంపాటి నాగరాజు మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు,హుదూద్,తితిలీ,తు పాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసామని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు,జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు..కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు,పేద ప్రజలకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు  శానిటైజర్లు,మాస్కులను,నిత్యావసర వస్తువులను,ఆహార పొట్లాలను దాతల సహకారం తో పంపిణీ చేస్తున్నామని నాగరాజు తెలిపారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు గంపలగూడెం లో ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) కార్యవర్గ సభ్యులు బి ప్రసాదరావు, రంజిత్ కుమార్, ఏం ప్రదీప్, జి కృష్ణయ్య, రవికుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *