@ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఆధ్వర్యంలో గణపవరం లో వలస కూలీలకు,నిరుపేదలకు,జర్నలిస్టులకు బియ్యం, కూరగాయలు పంపిణీ @
@ స్థానిక శాసన సభ్యురాలు విడదల రజనీ చేతుల మీదుగా పంపిణీ @
చిలకలూరిపేట/గణపవరం: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఉమెన్స్ వింగ్ మరియు గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిలకలూరు పేట నియోజకవర్గం లోని గణపవరం గ్రామం లో “మీ అండ్ మై వరల్డ్ టీం” సహకారంతో 300 మంది వలస కూలీలు,నిరుపేదలకు,జర్నలిస్టులకు కూరగాయలు,బియ్యం పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యురాలు విడదల రజిని హాజరై వలస కూలీలకు,పేద ప్రజలకు,జర్నలిస్టులకు బియ్యం,కూరగాయలు పంపిణీ చేశారు.
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ దేవి, ఎన్.ఏ.ఆర్.ఎ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ ముక్తార్ అహ్మద్ ఆధ్వర్యంలో “మీ అండ్ మై వరల్డ్ టీం” సహకారంతో ఈ కార్యక్రమం జరిగినది.
ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు విడదల రజిని మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తిలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు వచ్చి పేద ప్రజలు ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఎంతో మంది సమాజంలో ధనవంతులున్నారని, సేవచేయాలనే ఆలోచన కొద్దిమందికి మాత్రమే ఉంటుందని, దేవుడు ఆ అవకాశం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వారికి కల్పించాడని అందులో భాగంగా ఈ రోజు గణపవరం గ్రామం లో 300 మంది వలస కూలీలకు,పేద ప్రజలకు,జర్నలిస్టులకు బియ్యం కూరగాయలు పంపిణి చేసారన్నారు… నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వారు ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు,హుదూద్,తితిలీ,తు పాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసారని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు, జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు..కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు యడ్లపాడు లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్.ఎ.ఆర్.ఎ ఉమెన్స్ వింగ్ సెక్రెటరీ దేవి,గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ ముక్తార్ అహ్మద్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే రజని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ ఎమ్.శ్రీకాంత్,జిల్లా నాయకులు శ్యామ్,మీ అండ్ మై టీమ్ సభ్యులు లక్ష్మీ,హాలీమా, మల్లీశ్వరి పాల్గొన్నారు.