సమాజ సేవలో మేము సైతం అంటూ ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ అసోసియేషన్

చెరుకుపల్లి: రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామంలో సోమవారం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలిడారిటి, మి అండ్ మై సంస్థల సహకారంతో పేద ప్రజలకు,సెక్స్ వర్కలకు బియ్యం, కూరగాయలు,నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు,హుదూద్,తితిలీ,తు పాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసామని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు,జర్నలిస్టులకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో సామాజిక సేవలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు..కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు,పేద ప్రజలకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు  శానిటైజర్లు,మాస్కులను,నిత్యావసర వస్తువులను,ఆహార పొట్లాలను దాతల సహకారం తో పంపిణీ చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు.

నేషనల్ జాయింట్ సెక్రటరీ ప్రసాద రావు మాట్లాడుతూ మనం – మన సమాజం – మన రాష్ట్రం – మన దేశం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ చేసే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మీకు చేతనైనంత ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులను అందించి,కరోనా పై పోరాటానికి సహకారం అందించాలని దాతలను  కోరారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు చేరుకుపల్లి లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సాలిడారిటి,మి అండ్ మై వరల్డ్ సంస్థ జాతీయ కార్యదర్శి పొట్లూరి దేవి అన్నారు, రేపల్లె నియోజకవర్గ మండల క్రేందమై చెరుకుపల్లి గ్రామంలో సోమవారం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్  అసోసియేషన్ ,సాలిడారిటి, మి అండ్ మై సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో  పేద ప్రజలకు, సెక్స్ వర్కలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు, ఈసందర్భంగా జాతీయ కార్యదర్శి పొట్లూరి దేవి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ కు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ రోజు వారి కూలి పనులు చేసుకోనే పేద ప్రజలకు పూట గడవడం కూడా కష్టం గా ఉన్న తరుణంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చెరుకుపల్లి గ్రామంలోని అట్టడుగు ఉన్న పేద ప్రజలకు గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆమె వివరించారు,ఇంతకుముందు మా సంస్థ తరుపున చిలకలూరిపేట సమీపంలో ని గణపవరం, బాపట్ల తదితర ప్రాంతాలలో లాక్ డౌన్ నేపథ్యంలో పేదప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు, లఇదే స్పూర్తితో జిల్లా లోని పలు ప్రాంతాలలో కూడా అధికారుల అనుమతి తో పలు సేవా కార్యక్రమాలు చెప్పటనుట్లు దేవి చెప్పారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మునిపల్లి శ్రీకాంత్,ప్రసాద రావు,ముక్తార్,సాలిడారిటి సంస్థ ప్రతినిధులు మంగమ్మ,మల్లేశ్వరి, అన్నామణి ,లక్ష్మీ, హనీమ  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *