గుండె లోతుల్లో పొరలు పొరలుగా తన్నుకొస్తున్న జ్ఞపకాలు… ఎంత తీయదనం కొంచెం కొంచెంగా అలనాటి అద్భత ఘడియలని నెమరేస్తుంటే!
బాధ్యతల బరువు మోతల్లో, ఎదగాలనే ఎదురు చూపుల్లో, ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో… నీవు ప్రారంభించిన కార్యక్రమాలు అలసట లేకుండా అలవోకగా విజయవంతంగా అంతం కావాలని… ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులతో శత వసంతాలు జరుపుకోవాలని కోరుకొంటూ…
తడబడినప్పుడు వెన్ను తడుతూ, మా ఆలోచనల ఉహల తోడుగా, ముచ్చటగా మనుసులో మాటలు పంచుకోవడానికి… కష్ట సుఖాలు తెలుపుకోవడానికి… మంచి చెడులు తెలిపే ఓ నేస్తం!
ఎంత దగ్గర ఉన్న అధిగమించలేని దూరాన్ని తగ్గించి, ఆత్మీయులుగా కలుసుకుని, ఆప్యాయంగా పలకరించుకునేందుకు మాకెప్పుడు కావాలి నీ చల్లని స్నేహ హస్తం!
మరోసారి మనసారా మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సభ్యులు